కాగజ్నగర్ నుండి ఆసిఫాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో పెద్దవాగు బ్రిడ్జ్ పైన ఒక పెద్ద గుంత ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంత ఇంకాస్త పెరిగి ప్రమాదకరంగా మారకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు. లేని యెడల పెద్ద ప్రమాదమే జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.