ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజులు సకాలంలో చెల్లించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్ చార్జ్ ప్రిన్సిపల్ సపన్ కుమార్ మండల్ తెలిపారు. నవంబర్ 6 నుంచి 26 వరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రూ. 520, సీఈసీ మినహా సెకండ్ ఇయర్ విద్యార్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుందన్నారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 27 లోపు అపరాధ రుసుంతో ఫీజు కట్టవచ్చని వెల్లడించారు.