ఆన్ లైన్ మట్కా ఆడుతూ యువకుడు పట్టుబడిన ఘటన కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిథిలో శనివారం చోటుచేసుకుంది. కాగజ్నగర్ టౌన్ సీఐ పీ. రాజేంద్రప్రసాద్ వివరాల ప్రకారం.. డాడానగర్ కు సమీపంలో మట్కా ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు ఎస్ఐ దీకొండ రమేష్ దాడులు నిర్వహించారు. సెల్ ఫోన్లో మట్కా ఆడుతున్న షహబాజ్ అహ్మద్ వద్ద రూ. 1500 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనపరచుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.