కాగజ్నగర్ పట్టణం సంఘం భస్తికి చెందిన తగరం దుర్గయ్య గత 2 రోజుల క్రితం ఇంటి నుండి తప్పిపోయారు. స్తానిక శ్రీరాంనగర్ కాలనీ సమీపంలో వృద్దుడు కాంగ్రెస్ నాయకులు వనమాల రాముకు కనిపించగా కాగజ్నగర్ టౌన్ సీఐ తుత్తూరు శంకరయ్యకు సమాచారం ఇచ్చారు. స్పందించిన టౌన్ సీఐ బ్లూ కోట్ కానిస్టేబుల్ వేంకటేష్ ను పంపించారు. అక్కడికి చేరుకున్న బ్లూ కోట్ సిబ్బంది వృద్దున్ని జాగ్రత్తగా వారి ఇంటికి తరలించి కుమారునికి అప్పగించారు.