నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతిఒక్కరు సహకరించాలని రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.