కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద శనివారం ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమం చేపట్టారు. మాజీ సీఎం కెసిఆర్ పై అనుచిత వాక్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, సిఎం స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. భేషరతుగా క్షమాపణలు తెలపాలని, లేనిచో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.