కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులకు నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ ఆధ్వర్యంలో గత 15 రోజుల పాటు ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించారు. బుధవారం శిక్షణ పూర్తి చేసుకున్న కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలకిషన్ మాట్లాడుతూ ఉచిత నైపుణ్య శిక్షణతో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తామన్నారు.