కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ లో శనివారం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మున్సిపల్ కమిషనర్ భుజంగరావు ప్రారంభించారు. స్టిక్కరింగ్ చేసిన ఇళ్లలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబంలో సభ్యులందరి ఫోన్, ఆధార్ నంబర్లు సహా సమస్త వివరాలను నమోదు చేశారు.