బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలల పరిరక్షణ లీగల్ అధికారి శ్రావణ్ కుమార్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ లోని బాబాపుర్ జ్యోతిబా ఫూలే పాఠశాలలలో బాలల హక్కుల వారత్సోవాల్లో భాగంగా బాలల హక్కుల రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ రత్న బాయి, బాల సంరక్షణ సూపర్వైజర్ పితాంబర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.