ఇల్లందు: ఎమ్మెల్యేను కలిసిన లీగల్ సెల్ కన్వీనర్
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ లీగల్ సెల్ కన్వీనర్ కిషన్ నాయక్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విక్రమ్ రాజ్, పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.