వైరా: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

78பார்த்தது
వైరా: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కారేపల్లి క్రాస్రోడ్డులో ఏర్పాటు చేసిన విశ్వనాథపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన మోసానికి రూ. 7వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడిందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி