ఆగస్ట్, సెప్టెంబర్లలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం పొందే రైతుల జాబితాలో పేర్లు లేని వారికి కూడా పరిహారం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు వినతిపత్రం ఇచ్చారు. వైరా మండలంలోని విప్పలమడక, గన్నవరం రైతులకు పరిహారం అందలేదని తెలిసింది. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, పారుపల్లి కృష్ణారావు, మేడా శరాబందీ పాల్గొన్నారు.