రాబోయే ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించాలని, ఈ దిశగా శిక్షణ ఇచ్చేందుకు 57 ఎకరాల్లో స్పోర్ట్స్ యూవర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఈ పోటీలను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ నిపుణులను పిలిపించి స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.