పదో తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చని అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ తెలిపారు. వైరా మండలంలోని రెబ్బవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం తనిఖీ చేసిన ఆమె మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. ఆ తర్వాత పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలపై భయాన్ని వీడి శ్రద్ధగా చదువుకోవాలని తెలిపారు. ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.