బీఎస్పీ వైరా నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఏన్కూరు మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో అన్ని వర్గాలను ఐక్యం చేసి నీలి జెండాను ఎగరవేయడం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అనంతరం పార్టీ వైరా నియోజకవర్గ ఇన్ చార్జిగా జెర్రిపోతుల నరేష్ ను నియమించారు.