పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు అన్నారు. కల్లూరు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణమండలంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు పదిహేనేళ్లుగా పంచాయతీల్లో పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనం రూ. 15వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులకు నూతన వస్త్రాలు అందించి సన్మానించారు.