సత్తుపల్లిలో నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సత్యనారాయణ గౌడ్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే మట్ట రాగమయి పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుడిని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించారు. సత్యనారాయణ తన ఉపాధ్యాయ వృత్తిలో అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారని చెప్పారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులను క్రమశిక్షణ మార్గంలో ఉంచేది ఒక్క ఉపాధ్యాయులు మాత్రమేనని పేర్కొన్నారు.