కల్లూరులో నూతనంగా నిర్మిస్తున్న షాదిఖానా నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఎమ్మెల్యే మట్టా రాగమయి శుక్రవారం పరిశీలించారు. అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు, రెండు మూడు నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు అన్ని వసతులు, మందులు అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ తదితరులు ఉన్నారు.