నేలకొండపల్లి: అదనపు తరగతుల నిర్మాణానికి శంకుస్థాపన

70பார்த்தது
నేలకొండపల్లి మండలం పైనంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణానికి శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందన్నారు. మండల అధికారులు దృష్టి సారించి పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా చూడాలన్నారు. అనంతరం ఉన్నత పాఠశాలకు అదనపు గదులు కావాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు.

தொடர்புடைய செய்தி