నేలకొండపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆడబిడ్డల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.