రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం సత్తుపల్లిలోని వేంసూరు రోడ్డులో నూతన ఫంక్షన్ హాల్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12గంటలకు కూసుమంచి తహశీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశాక హైదరాబాద్ బయలుదేరతారు. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు గమనించి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని తన క్యాంపు కార్యాలయ సిబ్బంది కోరారు.