ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కూసుమంచి మండల తహశీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. మిగిలిన రూ. 13వేల కోట్ల రుణమాఫీని కూడా డిసెంబర్ లోగా రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు.