విద్యుత్ లైన్ మరమ్మతు దృష్ట్యా ముదిగొండ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక ఫీడర్, న్యూలక్ష్మీపురం పారిశ్రామిక పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. పారిశ్రామిక పరిధిలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, గోకినేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.