మధిర మండల తహశీల్దార్ రాంబాబుకు శనివారం బీఆర్ఎస్ నాయకులు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. స్థానిక అవసరాలకు గాను ఎడ్లబండ్ల ద్వారా ఇసుక రవాణా చేసుకునేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వాలని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి లింగాల కమల్ రాజు తహశీల్దార్ ను కోరారు. ఎంతోమంది జీవనాధారంగా ఎంచుకొని ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా రవాణా చేస్తూ జీవిస్తున్నారని అన్నారు. దీనిపై తహశీల్దార్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.