మధిర పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీ, హనుమాన్ కాలనీ, ముస్లిం కాలనీలోని అంగన్వాడీ కేంద్రాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని స్థానిక మహిళలు అధికారులను విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయా కాలనీకి చెందిన మహిళలు అంగన్వాడీ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో స్థానికేతరులను నియమించడం సరికాదని, వెంటనే అధికారులు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.