మధిర: నాలుగు వరుసలుగా ఖమ్మం-బోనకల్ రోడ్డు

54பார்த்தது
మధిర: నాలుగు వరుసలుగా ఖమ్మం-బోనకల్ రోడ్డు
ఖమ్మం నుంచి బోనకల్ వరకు రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు శనివారం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఖమ్మం నుంచి నాగులవంచ, బోనకల్, ఆళ్లపాడు, మధిర మీదుగా నందిగామ వరకు రహదారి విస్తరించేలా ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత నేతృత్వాన ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు రోడ్డు విస్తరణ చేపడితే ఏళ్లుగా ఎదురుచూస్తున్న బోనకల్, చింతకాని మండలాల ప్రజల కోరిక తీరనుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி