ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు శుక్రవారం మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల గురించి వారితో చర్చించారు.