ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం జిల్లాలోని మధిర, బోనకల్, చింతకాని, ఖమ్మం మండలాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరు ఈ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.