చింతకాని మండలం నాగులవంచ, తిర్లాపురం, ఆర్అండ్ బీ రోడ్డు నుండి చింతకాని వయా తుమ్మలమ్మ చెరువు వరకు రూ. 5 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు పనులకు గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు చెందాలని తమ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను తీసుకు వచ్చిందన్నారు. గత దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామని చెప్పారు.