20న టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు

591பார்த்தது
20న టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినం సందర్భంగా ఈ నెల 20న ఖమ్మం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్ చంద్ర తెలిపారు. ఉదయం 9 గంటలకు పార్టీ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం చేతుల మీదుగా 74 కేజీల కేక్ కటింగ్, అనంతరం మధ్యాహ్నం 12గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி