ఎన్నికల సమయంలో మేడిపల్లి మండలం పొరుమల్ల గ్రామస్తుల చిరకాల కోరిక పొరుమల్ల అయోధ్య రోడ్డు నిర్మాణం చేపట్టాలని పొరుమల్ల గ్రామానికి చెందిన మాసం భూమా రాజక్క కోరగా.. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే తప్పకుండా పొరుమల్ల అయోధ్య రోడ్డు చేపడుతానన్నారు. హామీ ప్రకారం రూ. 2 కోట్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పొరుమల్ల గ్రామంలో భూమి పూజ చేసి అనంతరం మాసం భూమా రాజక్క ఇంటికి వెళ్లి చాయ్ తాగారు.