కోనరావుపేట మండలం పల్లె నిజమాబాద్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కనపర్తి బ్రహ్మంపై పోక్సొ కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. పోలీస్ అక్క ప్రోగ్రాంలో భాగంగా షీ టీమ్ పోలీసులు విద్యార్థినులకు గుడ్ బ్యాడ్ టచ్ అవగాహన కల్పిస్తుండగా కొంతమంది విద్యార్థులు టీచర్పై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండు తరలించారు.