రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో చనిపోయిన హోంగార్డ్స్ శ్యామ్ కుమార్, వెంకటేశం, నగేష్, ఫెరోజ్ ఖాన్ లకు హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి రూ. 15వేల చొప్పున మంజూరైన చెక్కులను గురువారం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ హోంగార్డ్స్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, ఏఆర్ ఏసిపి ప్రతాప్, హోంగార్డ్స్ ఆర్ఐ మల్లేశం పాల్గొన్నారు.