ధాన్యం నాణ్యత ప్రమాణాలు రాగానే త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం, పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు, భూపతిపూర్ లోని ఐకెపి కొనుగోలు కేంద్రం, కాట్నపల్లిలోని ఐకెపి కొనుగోలు కేంద్రం తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఏపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.