ఫార్మ్ డి డాక్టర్స్, విద్యార్థుల సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలని బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి డాక్టర్ శీలం వెంకటేష్, జిల్లా కన్వీనర్ గంగిపెల్లి విద్యాసాగర్ ల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మ్ డి డాక్టర్స్, విద్యార్థులు, సిపిఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.