ఎలాంటి లోపాలు లేకుండా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వేను శనివారం పెద్దపల్లి పట్టణం 18వ వార్డులో కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఆర్డీఓ గంగయ్య, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ పాల్గొన్నారు.