ప్లాస్టిక్ తో ప్రమాదం అనే నాటికను ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపికైన సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులను జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ పీఎం షేక్ అభినందించారు. బుధవారం జిల్లా సమగ్ర శిక్షా కళా ఉత్సవాలు 2024 జిల్లా స్థాయి నాటికల పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. నవంబర్ 2న హైదరాబాద్ లో జరిగే పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.