కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. శనివారం మంథని వ్యవసాయ మార్కెట్ యార్డు, మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ ఉన్నారు.