రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మంథని ఏఎంసి, ఎక్లాస్ పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, డిఎంఓ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.