కొత్తపల్లి పట్టణాన్ని కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం చేయవద్దని మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా అదనపు కలెక్టర్ ఫ్రపుల్ దేశాయ్ కి మంగళవారం వినతి పత్రం అందించారు. కౌన్సిల్ సమావేశం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై తీర్మానం చేశారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు కరీంనగర్ లో విలీనం చేయవద్దని, బీజేపీ కౌన్సిలర్లు విలీనంపై సుముఖంగా ఉన్నామని తెలిపారు.