హుజురాబాద్లో ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కున్న మహిళను కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో ప్రాణాలతో బయటపడింది. ఖెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుంది. చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో సింగాపూర్ శివారులో డ్రైవర్ లారీని ఆపేశాడు. మంత్రి బండి ములుగు వెళ్తూ ఘటన స్థలి వద్ద ఆగారు. లారీ కింద టైర్ పక్కన రాడ్డులో జుట్టు చిక్కుకొని రక్తమోడుతూ వేళాడుతుండటతో జుట్టు కత్తిరించి ఆమెను బయటకు తీయాలని స్థానికులకు సూచించారు. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు.