జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆరపేట గ్రామ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను, వంటశాలను, స్టోర్ రూంను తనిఖీ చేశారు. ఫుడ్ ప్రొవిజన్స్ ని పరిశీలించారు. భోజనం రోజూ వారి మెను ప్రకారం అందించాలని ఆదేశించారు. ఆయన వెంట షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారి కె. రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మోహన్ పాల్గొన్నారు.