జగిత్యాల జిల్లా కేంద్రంలో వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన నిరుపేద మహిళలకు ఖతర్ దేశంలో ఉండే ఎండపెల్లి మండలం గుల్లకోటకు చెందిన జల్లెల కిరణ్ శుక్రవారం రూ. 50, 000 విలువచేసే కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మూల శ్రీనివాస్, తిరుపతి ఫౌండేషన్ సభ్యులు మహేష్, తిరుపతి, మల్లికార్జున్, రాజు ఆవాస సభ్యులు సంపూర్ణ చారి పాల్గొన్నారు.