జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం శాఖపూరు గ్రామంలో, ఎండపెల్లి మండల కేంద్రములోని ఫ్యాక్స్ ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ సనపు దొడ్డు ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధు సుదన్, డిఆర్డిఓ రఘు వరుణ్ పాల్గొన్నారు.