ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం మాలల మహా పాదయాత్ర విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య పిలుపునిచ్చారు. బుధవారం ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మాల మహానాడు అధ్యక్షుడు జేంజీరికాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.