జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం అధికారులు, మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.