చొప్పదండిలో బీఆర్ఎస్ రాస్తారోకో
రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం చొప్పదండి మండల కేంద్రంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్తారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గాండ్ల లక్ష్మణ్, వినయ్ కుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.