బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో శ్రీ పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం కొరకు తడగొండ గ్రామస్థుడు చేపూరి శ్రీను తండ్రి గంగయ్య ఆలయ రంగుల గూర్చి యాభై వేల రూపాయలు చందా శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా గ్రామ దేవత పోచమ్మ ఆలయ నిర్మాణంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబం పై ఎల్లవేళలా ఉండాలని పోచమ్మ పునర్నిర్మాణ ఆలయ నిర్మాణ కమిటీ కోరారు.