జాతీయ బిసి యువజన సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ తెలంగాణ దీక్ష

389பார்த்தது
జాతీయ బిసి యువజన సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ తెలంగాణ దీక్ష
కార్యక్రమం కామారెడ్డి జిల్లా కేంద్రం లోని మునిసిపల్ ఆఫీస్ వద్ద శనివారం జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ తెలంగాణ నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు నిరుద్యోగ భృతి, రుణాలు కలిపించి , ఉద్యోగ నోటిఫికేషన్ లను వెంటనే సక్రమంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, ప్రధాన కార్యదర్శి అఖిల్ రావు, బహుజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు క్యాతం సిద్ధ రాములు, ఎంబీసీ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, బామ్ సేఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, Bvm విద్యార్థి నాయకులు విటల్, బిజెపి పార్టీ నుండి రమణారెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ వడ్డపల్లి సుభాష్ రెడ్డి, టీజేఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ముదిరాజ్, Tjs జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ యాదవ్, మాల మహానాడు రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి నాగమణి, జాతీయ బిసి సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి మంజుల, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అరవింద్, బీసీ యూత్ కోశాధికారి సాయి నిఖిల్, యూత్ నాయకులు శ్రీధర్ పటేల్ , నరేష్ , భాస్కర్ , ప్రవీణ్ దిలీప్, సందీప్ తదితరులు మద్దతు పలికారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி