ఎల్లారెడ్డి శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం నుంచి ముగ్గురు అయ్యప్ప స్వాములు మాలా వేసుకొని సోమవారం శబరిమల మహాపాదయాత్రను బాన్స్ వాడ వినయ్ గురుస్వామి, వసంత్ గురు స్వామి ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలోని శబరిమలకు బయలు దేరారు. ఎల్లారెడ్డికి చెందిన భూపాల్ స్వామి 5వ సారి, ప్రవీణ్ స్వామి 2వసారి, సంతోష్ స్వామి 2వసారి పాదయాత్రగా1500కిలోమీటర్ల శబరిమలకు పాదయాత్రగా బయలు దేరారు.